Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీకటి గోపి లాకప్ డెత్‌పై న్యాయ విచారణ చేపట్టాలి

Follow Udayam on Google
Hafiz Ghouse Sep 23, 2026 3:21 PM కర్నూలుఆంధ్రప్రదేశ్
చీకటి గోపి లాకప్ డెత్‌పై న్యాయ విచారణ చేపట్టాలి - Udayam
తాడికొండ మండలం పొన్నెకల్లు యువకుడు చీకటి గోపి 30 లాకప్ డెత్‌కు కారణమైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకొండ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బురుజుల పులికొండ డిమాండ్ చేశారు. పత్తికొండ ఆర్డీవో ఓబులేసుకు వినతిపత్రం అందించారు. గోపి మరణంపై న్యాయ విచారణ జరిపి, కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, భార్యకు ఉద్యోగం, ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...