Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెక్ బౌన్స్‌ కేసులో మహిళకు 6 నెలల జైలుశిక్ష

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 9:30 AM ఖమ్మంGeneral
చెక్ బౌన్స్‌ కేసులో మహిళకు 6 నెలల జైలుశిక్ష - Udayam
ఖమ్మం ఒకటో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు చెల్లని చెక్కు కేసులో మహిళకు 6 నెలల జైలుశిక్ష విధించింది. 2017లో వెంకటేశ్వరరావు వద్ద రూ.3 లక్షలు రుణం తీసుకున్న దీప్తి శశికళారాణి, 2019లో రూ.4.44 లక్షల చెక్కు ఇచ్చారు. ఖాతాలో నగదు లేక చెక్కు బౌన్స్‌ కావడంతో వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం న్యాయమూర్తి బెక్కం రజని జైలుశిక్షతో పాటు రూ.4.44 లక్షలు చెల్లించాలని తీర్పునిచ్చారు.

Comments

G
Loading comments...