వార్తలకు తిరిగి వెళ్లండి
కేతిరెడ్డి కాలనీ 23వ సచివాలయం వద్ద చేనేత కార్మికులు పెన్షన్ వెరిఫికేషన్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సచివాలయ అధికారులతో వాగ్వాదానికి దిగారు.
ఏళ్లుగా మగ్గాలు నేస్తున్న అర్హులైన చేనేతలకు కాకుండా అనర్హులకు వెరిఫికేషన్ పత్రాలు మంజూరు చేసి పెన్షన్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ నాయకులు అధికారులను నిలదీశారు. అర్హులైన చేనేతలకే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

