వార్తలకు తిరిగి వెళ్లండి

గూళ్యం–బల్లూరు బస్సును సిద్ధాపురం మీదుగా నడపకపోతే ఆందోళన చేస్తామని కర్నూలు జిల్లా హాలహర్వి మండలం సిద్ధాపురం గ్రామస్థులు హెచ్చరించారు. రహదారి బాగోలేదనే కారణంతో సోమవారం బస్సును తిప్పలేమని సిబ్బంది చెప్పారని తెలిపారు.
దీంతో పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి యథావిధిగా బస్సు సర్వీస్ కొనసాగించాలని కోరారు.
Comments
Loading comments...

