Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోట్ బోల్తా పడి వ్యక్తి మృతి

Follow Udayam on Google
K Anuradha Sep 11, 2026 9:21 AM శ్రీకాకుళంGeneral
బోట్ బోల్తా పడి వ్యక్తి మృతి - Udayam
ఎచ్చెర్ల మండలం బడివానిపేటకు చెందిన మత్స్యకారుడు వారధి మహందాత (52) కర్ణాటకలోని మంగళూరులో గురువారం మృతి చెందారు. ఏడుగురు కలిసి సముద్రంలో వేటకు వెళ్లగా కెరటాల ధాటికి బోటు బోల్తా పడింది. ఆరుగురు సురక్షితంగా బయటపడగా, తీవ్ర గాయాలైన మహందాత మృతి చెందారు. శుక్రవారం మృతదేహం స్వగ్రామానికి చేరడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Comments

G
Loading comments...