వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా అల్లాడపేటకు చెందిన చిన్నమ్మడు అదృశ్యమైన ఆరు రోజుల తర్వాత పిండ్రువాడ సమీపంలోని పొదల్లో మూటకట్టిన స్థితిలో మృతదేహంగా లభించారు. బంగారు ఆభరణాల కోసమే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ కేసులో ఓ మహిళా న్యాయవాదితోపాటు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

