Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బీజేపీ నేత ఇంటి వద్ద క్షుద్రపూజలు !

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 14, 2026 4:12 PM యాదాద్రి భువనగిరిGeneral
బీజేపీ నేత ఇంటి వద్ద క్షుద్రపూజలు ! - Udayam
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం భట్టుగూడెంలో బీజేపీ యువమోర్చా నాయకుడు తరుణ్‌రెడ్డి నిర్మిస్తున్న ఇంటి వద్ద క్షుద్రపూజల కలకలం రేగింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పూజలు చేసి ఆనవాళ్లను ఇంటి పునాదిలో పడేసినట్లు సమాచారం. తరుణ్‌రెడ్డి వాటిని గమనించిన వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. ఇంటి వద్ద జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...