వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి సమీపంలోని జాతీయ రహదారి-7పై ఉన్న ఓ రెస్టారెంట్లో ఆహార భద్రతా అధికారుల తనిఖీల్లో బియ్యం పాత్రలో బల్లి కనిపించింది. ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించిన అధికారులు బియ్యం నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు.
వినియోగదారుల ఆరోగ్యానికి ప్రమాదకరంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రెస్టారెంట్ లైసెన్స్ సస్పెండ్ చేయాలని సిఫారసు చేశారు.
Comments
Loading comments...

