వార్తలకు తిరిగి వెళ్లండి

సమగ్ర కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొన్నారు.
విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో బీసీలకు సామాజిక న్యాయం అందాలని అన్నారు. దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

