వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండలోని ముస్లిం వీధిలో కొలువైన హజ్రత్ మహబూబ్ సుబాని (దస్తగిరయ్య స్వామి) ఉరుసు ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. దర్గాను అలంకరించారు. మాజీ కేడీసీసీ చైర్మన్ రామచంద్ర రెడ్డి, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ హాజరై స్వామికి పూల చాదర్లు సమర్పించారు.
భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూలమాలలు, చాదర్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రార్థనలు చేశారు. దర్గా ప్రాంగణంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

