వార్తలకు తిరిగి వెళ్లండి

భీమడోలులో అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని ఫొటోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం వేడుకలు నిర్వహించారు. సంతమార్కెట్ వద్ద కలాం, ఫొటోగ్రఫీ పితామహుడు డాగ్యురే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కష్టపడి, పట్టుదలతో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని పిల్లి బ్రహ్మరావు అన్నారు. సంఘం అధ్యక్షుడు రామ్మూర్తి, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

