Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌కు తగ్గిన రష్యా చమురు దిగుమతులు

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 6:03 PM జాతీయంవాణిజ్యం
భారత్‌కు తగ్గిన రష్యా చమురు దిగుమతులు - Udayam
రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు సెప్టెంబరులో రోజుకు 1.82 మిలియన్‌ బ్యారెళ్లకు తగ్గాయి. చైనా నుంచి పెరిగిన పోటీ, అమెరికా ఆంక్షలు ఇందుకు కారణమని కెప్లర్‌ నివేదిక పేర్కొంది. జులైలో రోజుకు 2.57 మిలియన్‌ బ్యారెళ్లుగా ఉన్న దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ఇరాన్‌ నుంచి సరఫరా తగ్గడంతో చైనా రష్యా చమురుపై ఆసక్తి పెంచుకుందని నివేదిక తెలిపింది. మరోవైపు, వెనెజువెలా నుంచి భారత్‌ చమురు దిగుమతులు పెరిగాయి.

Comments

G
Loading comments...