వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో టోకు ద్రవ్యోల్బణం ఆగస్టులో 9.92 శాతంగా ఉండగా, సెప్టెంబర్లో 11.39 శాతానికి పెరిగింది. ఇంధనం, విద్యుత్,ఆహార పదార్థాలు, తయారీ వస్తువుల ధరలు పెరగడం ఇందుకు ప్రధాన కారణమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం 25.85 శాతానికి,ఆహార ద్రవ్యోల్బణం 8.66 శాతానికి చేరాయి.ముడిచమురు ధరలు,రవాణా,ఎరువుల ఖర్చులు పెరగడం ఆహార ధరలపై ఒత్తిడిని కొనసాగించవచ్చని అంచనా.
Comments
Loading comments...

