Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైన్ స్నాచింగ్‌ యత్నం.. నిందితుడి పట్టివేత

Follow Udayam on Google
Harika Nov 03, 2026 10:30 AM జాతీయంGeneral
బెంగళూరులోని ఇందిరానగర్‌లో చైన్ స్నాచింగ్‌కు యత్నించిన ప్రభురాజ్‌ అనే వ్యక్తి కత్తితో మహిళను బెదిరించి బంగారు గొలుసు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మహిళకు ఎలాంటి గాయాలు కాలేదు. నిందితుడిని జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించగా, అతడి నేర చరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Comments

G
Loading comments...