వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజారోగ్యం దృష్ట్యా 16 రకాల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలను కేంద్రం నిషేధించింది. చికిత్సలో వీటివల్ల ఎటువంటి శాస్త్రీయ ప్రయోజనం లేదని నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వడంతో, వీటి తయారీ, విక్రయాలను ప్రభుత్వం నిలిపివేసింది.
డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు సూచనల మేరకు యాంటిబయాటిక్స్, టాపికల్, కాస్మెటిక్స్ విభాగాలకు చెందిన ఈ మందులపై నిషేధం విధించారు. ఈ మేరకు వెంటనే అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Comments
Loading comments...

