Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగినపూడికి ఆధ్యాత్మిక శోభ

Follow Udayam on Google
SHRUTHI Aug 19, 2026 9:29 PM కృష్ణా జిల్లాGeneral
మంగినపూడికి ఆధ్యాత్మిక శోభ - Udayam
మచిలీపట్నంలో టెంపుల్‌ టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగినపూడి బీచ్‌లో నిర్మిస్తున్న 63 అడుగుల మట్టి గణపతి పనులను పరిశీలించి, ఉత్సవ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. సాగర తీరంలో 11 రోజులపాటు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మంగినపూడి బీచ్‌ను ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.

Comments

G
Loading comments...