వార్తలకు తిరిగి వెళ్లండి

బాలలతో పనులు చేయిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. శుక్రవారం రామచంద్రపురం మండలం తాళ్లపాలెం ఇటుకబట్టీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బాలలను పనిలో పెట్టుకున్న ముగ్గురు యజమానులపై కేసులు నమోదు చేశారు.
బాలకార్మికుల సమాచారం తెలిస్తే 1098కు ఫోన్ చేయాలని మంత్రి కోరారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ కమిషనర్ బుల్లిరాణి, ACL నాగలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Loading comments...

