వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం సర్వజనాసుపత్రి వైద్యులు 15 ఏళ్ల బాలిక కడుపులో పేరుకుపోయిన 750 గ్రాముల వెంట్రుకల ముద్దను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. రాయదుర్గంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని కడుపునొప్పి, వాంతులు, బరువు తగ్గడంతో ఆసుపత్రిలో చేరింది. చిన్నప్పటి నుంచి వెంట్రుకలు తినే అలవాటు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
బాలికకు అరుదైన రాంపుజెల్ సిండ్రోమ్ ఉన్నట్లు నిర్ధారించారు.
Comments
Loading comments...

