వార్తలకు తిరిగి వెళ్లండి

వంగవీటి మోహన రంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు. అశ్వారావుపేట రింగురోడ్డు కూడలిలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంగా విగ్రహాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సమక్షంలో ఆవిష్కరించారు.
38 ఏళ్లు గడిచినా రంగా ప్రజల గుండెల్లో నిలిచారంటే ఆయనపై ఉన్న అభిమానం అర్థమవుతుందని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

