Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

300 గ్రాముల గంజాయితో యువకుడి అరెస్ట్

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 5:17 PM జగిత్యాలGeneral
300 గ్రాముల గంజాయితో యువకుడి అరెస్ట్ - Udayam
ఇబ్రహీంపట్నం బస్టాండ్‌లో 300 గ్రాముల ఎండు గంజాయితో బిహార్‌కు చెందిన సాగర్(19) పోలీసులకు పట్టుబడ్డాడు. నమ్మదగిన సమాచారంతో ఎస్సై నవీన్ ఆధ్వర్యంలో నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు.. మెట్‌పల్లి నుంచి ఆర్టీసీ బస్సులో వచ్చిన సాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద గంజాయితో పాటు మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ సురేశ్‌బాబు తెలిపారు.

Comments

G
Loading comments...