వార్తలకు తిరిగి వెళ్లండి

ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులు ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే ప్రత్యేక నమోదు కార్యక్రమాల్లో ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆర్డీవో కృష్ణవేణి సూచించారు. ముఖ్యంగా 18–19 ఏళ్ల యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఓటర్ల జాబితా సవరణలో 41,900 నోటీసులు రూపొందించగా, 41,764 అందజేసినట్లు తెలిపారు. పట్టభద్రుల ఓటరు నమోదుకు 4,192 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

