వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపర మండలం అన్నవరం గ్రామంలో సోమవారం సాయంత్రం భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. కోలాటి శ్రీనివాసరావు పెరట్లో కోడిని పట్టుకున్న కొండచిలువను గుర్తించిన గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.
గ్రామస్థులు కలిసి దానిని చంపినట్లు శ్రీనివాసరావు తెలిపారు. నదీతీర గ్రామం కావడంతో తరచూ పాములు వస్తుంటాయని, ఈ కొండచిలువ సుమారు 9 అడుగుల పొడవు ఉందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

