Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'అన్నదానం' పేరిట కేటుగాళ్ల బురిడీ

Follow Udayam on Google
J Nani Sep 19, 2026 4:58 PM విజయనగరంGeneral
'అన్నదానం' పేరిట కేటుగాళ్ల బురిడీ - Udayam
విజయనగరం పట్టణంలో కేటుగాళ్లు వినూత్న రీతిలో మోసానికి పాల్పడ్డారు. 'అన్నదానం' పేరుతో ఓ టెంట్ హౌస్ యజమానికి రూ.1,000 అడ్వాన్స్ ఇచ్చి, రూ.60 వేల విలువైన సిల్వర్ టబ్బులు, మూతలను ఆర్డర్ చేశారు. అనంతరం డెలివరీకి వెళ్తున్న రిక్షా డ్రైవర్ను మార్గమధ్య లోనే అడ్డుకుని, సరుకును అపహరించి పరారయ్యారు. బాధిత యజమాని ఫోన్ చేయగా అది నకిలీ నంబర్ గా తేలింది. ఈ మోసం దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

Comments

G
Loading comments...