అనిరుధ్‌కు 'టైమ్100' గౌరవం!

ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ ప్రకటించిన ‘టైమ్100 నెక్స్ట్ ఇండియా-2026’ జాబితాలో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ చోటు దక్కించుకున్నారు. మ్యూజిక్ విభాగంలో ఆయనకు ఈ అరుదైన గుర్తింపు లభించింది.
దీనిపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందిస్తూ అనిరుధ్ ఒక మ్యూజికల్ జీనియస్, నిజమైన ఇండియన్ పాప్‌స్టార్ అని కొనియాడారు. అనిరుధ్ అభిమానుల జాబితాలో తానే అగ్రస్థానంలో ఉంటానని బన్నీ అభినందించారు.
Comments
Loading comments...
