వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డికి చెందిన తోపాజి అనంత కిషన్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి టీజీ వెంకటేష్ సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సంఘ పెద్దలు అభినందనలు తెలిపారు.
సమాజంలో ఐక్యత, సేవా కార్యక్రమాల విస్తరణే తన ప్రాధాన్యతని అనంత కిషన్ స్పష్టం చేశారు. ఆర్యవైశ్యుల విద్య, ఉపాధి అవకాశాల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

