Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డెఫ్ టీ20 ఛాంపియన్‌గా అనకాపల్లి

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 10, 2026 5:55 PM అనకాపల్లి ఆంధ్రప్రదేశ్
డెఫ్ టీ20 ఛాంపియన్‌గా అనకాపల్లి - Udayam
విశాఖ ACA-VDCA స్టేడియంలో ఆగస్టు 1, 2 తేదీల్లో జరిగిన 4వ జోనల్-1 డెఫ్ టీ20 క్రికెట్ ఛాంపియన్‌షిప్‌ను అనకాపల్లి జట్టు గెలుచుకుంది. ఫైనల్లో విశాఖ జట్టుపై విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. జిల్లాకు మంచి పేరు తెచ్చిన క్రీడాకారులను అధికారులు కొనియాడారు.

Comments

G
Loading comments...