Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అఖిల్‌కు ఫస్ట్ రూ.100 కోట్ల మూవీ

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 30, 2026 1:52 PM జాతీయంవినోదం
అఖిల్‌కు ఫస్ట్ రూ.100 కోట్ల మూవీ - Udayam
అక్కినేని అఖిల్ నటించిన ‘లెనిన్’ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును చేరినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ నెల 10న విడుదలైన ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో రూ.61.1 కోట్లు, 10 రోజుల్లో రూ.88 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అనంతరం మరో రూ.12 కోట్లు రాబట్టి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. అఖిల్ కెరీర్‌లో ఇది తొలి రూ.100 కోట్ల సినిమా కాగా, గతంలో నాగచైతన్య ‘తండేల్’తో ఈ ఘనత సాధించారు.

Comments

G
Loading comments...