Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయిల్ పామ్.. సుంకం తగ్గింపుపై తుమ్మల ఆగ్రహం

Follow Udayam on Google
K. Venkatesh Sep 24, 2026 5:47 PM ఖమ్మంతెలంగాణ
ఆయిల్ పామ్.. సుంకం తగ్గింపుపై తుమ్మల ఆగ్రహం - Udayam
ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం ముడి ఆయిల్పామ్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయం తీసుకుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు దేశంలో ఆయిల్ పామ్ సాగును విస్తరించాలని, రైతులను ఈ పంట వైపు మళ్లించాలని రాష్ట్రాలకు సూచిస్తూ.. మరోవైపు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్ పామ్ పై సుంకాన్ని తగ్గించడం కేంద్రప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.

Comments

G
Loading comments...