వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రీయ విద్యాలయ విద్యార్థులను ఒకే ఆర్టీసీ బస్సులో 109 మందిని తరలించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులో తీవ్ర రద్దీతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేసి, సురక్షిత రవాణా కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

