Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాలయ సీఈవో రేసులో 18 మంది

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 10, 2026 8:36 PM ఆల్ ఇండియా జాతీయ
రామాలయ సీఈవో రేసులో 18 మంది - Udayam
అయోధ్య రామాలయ తొలి సీఈవో నియామకానికి 5,000కుపైగా దరఖాస్తులు రాగా, ఎంపిక కమిటీ 18 మందిని ఇంటర్వ్యూలకు షార్ట్‌లిస్ట్‌ చేసింది. ఈ నెల 11, 12 తేదీల్లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వృత్తిపరమైన అనుభవం, నిబద్ధత, అయోధ్యలో పనిచేసే సంసిద్ధతను కమిటీ పరిశీలిస్తుంది. అనంతరం ముగ్గురి పేర్లను ట్రస్టుకు సిఫార్సు చేయగా, సెప్టెంబర్‌ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Comments

G
Loading comments...