12 గంటల్లో చిన్నారి కిడ్నాప్ కేసు ఛేదన

హైదరాబాద్ అమీన్‌పూర్‌లో అపహరణకు గురైన రెండున్నరేళ్ల చిన్నారి అక్షితను సైబరాబాద్ పోలీసులు 12 గంటల్లోనే సురక్షితంగా కాపాడి తల్లి ఒడికి చేర్చారు. ఈ కేసులో మెదక్ జిల్లాకు చెందిన గంగమణి (44) అనే మహిళను అరెస్టు చేశారు.
సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితురాలిని గుర్తించిన పోలీసులు.. నారాయణ్‌ఖేడ్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...
