వార్తలకు తిరిగి వెళ్లండి

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని దండేపల్లి మండల పోలీసులు సూచించారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం దండపల్లి మండల కేంద్రంలోని పలు కిరాణా షాపులను పోలీస్ నార్కోటిక్ డాగ్స్ స్కాడ్ తో తనిఖీలు చేపట్టారు. అనంతరం పోలీసులు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలను సేవిస్తే జీవితం ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు.
మంచి భవిష్యత్తు కోసం యువత చదువుపై దృష్టి పెట్టాలని వారు సూచించారు.
Comments
Loading comments...

