Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువత హెచ్‌ఐవీపై అవగాహన పెంచుకోవాలి:DMHO

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 8:41 PM గుంటూరుGeneral
యువత హెచ్‌ఐవీపై అవగాహన పెంచుకోవాలి:DMHO - Udayam
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై గుంటూరులో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.విజయలక్ష్మి జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. యువత హెచ్‌ఐవీపై అపోహ వీడి శాస్త్రీయ అవగాహన పెంచుకోవాలని, సురక్షిత ప్రవర్తన, ముందస్తు పరీక్షలతో దీనిని అరికట్టవచ్చని సూచించారు. బాధితులపై ఎలాంటి వివక్ష చూపరాదని తెలిపారు.

Comments

G
Loading comments...