వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లా హరైయా గ్రామంలో 17, 15 ఏళ్ల ఇద్దరు బాలికల మృతదేహాలు ఒకే జామచెట్టుకు వేలాడుతూ కనిపించాయి. సోమవారం ఉదయం గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇద్దరూ దగ్గరి బంధువులు, స్నేహితులని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరణాలకు గల కారణం ఇంకా వెల్లడికాలేదు.
Comments
Loading comments...

