Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ అవకతవకలపై వైసీపీ దీక్ష మూడో రోజుకు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 08, 2026 5:46 PM మార్కాపురంGeneral
డీఎస్సీ అవకతవకలపై వైసీపీ దీక్ష మూడో రోజుకు - Udayam
డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ వైసీపీ రిలే దీక్ష మూడో రోజుకు చేరుకుంది. మార్కాపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వారికి దండలు వేసి కార్యక్రమం ప్రారంభించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగులకు భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...