Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ స్థానిక ఎన్నికల్లో వైసీపీదే మెజార్టీ

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 19, 2026 10:40 AM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
విశాఖ స్థానిక ఎన్నికల్లో వైసీపీదే మెజార్టీ - Udayam
వచ్చే స్థానిక ఎన్నికల్లో విశాఖలో వైసీపీ మెజార్టీ సీట్లు గెలుచుకుంటాయని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ తెలిపారు. మంగళవారం తాడేపల్లిలో జగన్‌ను కలిసి నగర రాజకీయ పరిస్థితులను వివరించారు. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని వాసుపల్లి పేర్కొన్నారు. విశాఖ దక్షిణంలో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...