వార్తలకు తిరిగి వెళ్లండి
మెదక్ జిల్లా రామాయంపేట సబ్‌స్టేషన్ ఎదుట శనివారం రైతులు రాస్తారోకో, ధర్నా చేశారు. ఉదయం 6 గంటలకు వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వడం లేదని, అంతరాయాలతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్ణీత సమయంలో విద్యుత్ ఇవ్వాలని పలుమార్లు అధికారులను కోరినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Comments
Loading comments...

