వార్తలకు తిరిగి వెళ్లండి

యువత సమస్యలు, హక్కుల కోసం ఉద్యమించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రి పిలుపునిచ్చారు. మహబూబాబాద్‌లో ఏఐవైఎఫ్ 4వ జిల్లా మహాసభ నిర్వహించారు.
నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే జిల్లాలో వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

