Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నయ్యను చూసేందుకు వచ్చి ఏలూరులో యువతి అదృశ్యం

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 04, 2026 2:20 PM ఏలూరుGeneral
అన్నయ్యను చూసేందుకు వచ్చి ఏలూరులో యువతి అదృశ్యం - Udayam
అన్నయ్యను చూసేందుకు ఏలూరుకు వచ్చిన ఓ మేజర్ యువతి అదృశ్యమైంది. సీఐ కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన నల్లబోయిన వడ్డీకాసులు కుమార్తె విజయవాడలో బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. ఏలూరులో చదువుతున్న అన్నయ్యను కలిసిన తర్వాత బస్టాండ్‌లో తండ్రి ఎంక్వయిరీకి వెళ్లి తిరిగి వచ్చేలోపే ఆమె కనిపించకుండా పోయింది.

Comments

G
Loading comments...