Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాలకు వెళ్తుండగా యువతి మృతి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 16, 2026 3:45 PM హైదరాబాద్General
బోనాలకు వెళ్తుండగా యువతి మృతి - Udayam
బోనాల పండగ కోసం కుటుంబంతో కలిసి సొంతూరుకు వెళ్తున్న శ్రావణి(30) ఘట్‌కేసర్‌ బైపాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రావణి అక్కడికక్కడే మృతిచెందగా, ఆమె తల్లిదండ్రులు సురేశ్‌, ఉమారాణికి స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...