Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టినరోజే యువకుడి దుర్మరణం

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 11:28 AM విశాఖపట్నంGeneral
పుట్టినరోజే యువకుడి దుర్మరణం - Udayam
విశాఖలో పుట్టినరోజు వేడుకల అనంతరం ఇంటికి వెళ్తున్న మదన్‌ (24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఎన్‌ఎస్‌టీఎల్‌ గేటు సమీపంలో అతడు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ట్రావెల్‌ బస్సు ఢీకొట్టింది. దీంతో ముందు ఉన్న మరో బస్సును ఢీకొట్టి మదన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి స్నేహితుడు మణికుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...