Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌కు జిన్‌పింగ్‌.. సస్పెన్స్‌కు తెర

Follow Udayam on Google
Udayam Desk Sep 10, 2026 5:27 PM జాతీయంGeneral
 భారత్‌కు జిన్‌పింగ్‌.. సస్పెన్స్‌కు తెర - Udayam
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. సెప్టెంబరు 12, 13 తేదీల్లో దిల్లీలో జరిగే 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరవుతారు. ఈ విషయాన్ని చైనా అధికారికంగా వెల్లడించింది. ఏడేళ్ల తర్వాత జిన్‌పింగ్‌ భారత్‌కు రానున్నారు. బ్రిక్స్‌ సదస్సులో ఆయనతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. భారత్‌-చైనా సంబంధాలపై ఈ భేటీకి ప్రాధాన్యం ఉంది.

Comments

G
Loading comments...