వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి కొండపై క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం శాస్త్రోక్తంగా ఆకుపూజ నిర్వహించారు. విష్ణుపుష్కరిణి వద్ద ఆలయంలో అర్చకులు పంచసూక్తాలు, మన్యుసూక్త పఠనాలతో అభిషేకం చేసి స్వామివారిని సింధూరం, వివిధ రకాల పూలతో అలంకరించారు.
పాతగుట్ట ఆలయంలోనూ ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆకుపూజ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
Comments
Loading comments...

