వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం శివారులో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తాపడి నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. పలువురు స్వల్పంగా గాయపడగా, క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
రామాపురానికి చెందిన కూలీలు నాట్లు వేసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రహదారి పనులతో ఏర్పడిన గుంతలు, వర్షపు నీటి కారణంగా ఆటో అదుపుతప్పి బోల్తాపడినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

