Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడారంలో నివసిస్తూ యువ రచయితగా అద్భుతం

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 25, 2026 11:03 AM ఖమ్మంGeneral
గుడారంలో నివసిస్తూ యువ రచయితగా అద్భుతం - Udayam
ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా, గుడారంలో జీవిస్తున్న సంచార జాతి విద్యార్థి ఆవుల పోతురాజు అక్షర సాధనకు కృషి చేస్తున్నాడు. పేదరికం అడ్డుకాదని నిరూపిస్తూ బాల సాహిత్య రంగంలో యువ రచయితగా గుర్తింపు పొందాడు. ఆయన రచించిన ‘నాన్నే నా హీరో’ పుస్తకం ప్రోత్సాహక బహుమతికి ఎంపికైంది. ఈ నెల 26న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పురస్కారాన్ని అందుకోనున్నాడు. ఉపాధ్యాయులు, దాతల ప్రోత్సాహంతో పాలిటెక్నిక్‌ చదువుతున్నాడు.

Comments

G
Loading comments...