Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యారాడ బీచ్‌లో మహిళకు పునర్జన్మ

Follow Udayam on Google
జయ Aug 16, 2026 3:24 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
యారాడ బీచ్‌లో మహిళకు పునర్జన్మ - Udayam
విశాఖపట్నంలోని యారాడ బీచ్‌లో సముద్ర స్నానానికి దిగిన సూర్యలక్ష్మి(55) అలల ఉధృతికి నీటిలో కొట్టుకుపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన బీచ్‌ లైఫ్‌గార్డులు వెంటనే స్పందించి సముద్రంలోకి వెళ్లారు. కదిరి లావరాజ్‌, నొల్లి వీర్రాజు, చుట్టూరు శ్రీను, కదిరి వెంకటేష్‌ కలిసి ఆమెను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

Comments

G
Loading comments...