Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనస్థలిపురంలో భర్తను చంపిన భార్య

Follow Udayam on Google
Rohit Singh May 20, 2026 2:23 PM హైదరాబాద్General
వనస్థలిపురంలో భర్తను చంపిన భార్య - Udayam
హైదరాబాద్‌ వనస్థలిపురంలోని డబుల్ బెడ్‌రూమ్ గృహ సముదాయంలో భర్తను భార్య హత్య చేసిన ఘటన కలకలం రేపింది. వేధింపుల కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని తరలిస్తుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం సంఘటనా స్థలంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ హత్యకు గల పూర్తి కారణాలు, ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...