Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సప్ కాల్స్ రికార్డింగ్ ప్రచారం అబద్ధం: సీపీ సజ్జనర్

Follow Udayam on Google
Ravi Singh Jun 04, 2026 12:53 PM హైదరాబాద్General
వాట్సప్ కాల్స్ రికార్డింగ్ ప్రచారం అబద్ధం: సీపీ సజ్జనర్ - Udayam
వాట్సప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని హైదరాబాద్ సీపీ సజ్జనర్ స్పష్టం చేశారు. ఈ ఫేక్ వార్తలను నమ్మవద్దని, ఇతరులకు షేర్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని ఆయన పౌరులకు సూచించారు. రేపటి నుంచి వాట్సప్, ఫోన్ కాల్స్‌పై ప్రభుత్వం నిఘా పెడుతుందనే తప్పుడు సందేశం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇలాంటి అవాస్తవాలను ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

Comments

G
Loading comments...