Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్‌ మానేరు నుంచి 5 గేట్ల ద్వారా నీరు

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 10:55 AM రాజన్న సిరిసిల్లGeneral
మిడ్‌ మానేరు నుంచి 5 గేట్ల ద్వారా నీరు - Udayam
బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్‌ మానేరు జలాశయానికి వరద కొనసాగుతోంది. సోమవారం నీటిమట్టం 316.49 మీటర్లకు చేరగా, ప్రస్తుత నిల్వ 23.791 టీఎంసీలుగా ఉంది. ఇన్‌ఫ్లో 12,600 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 14,230 క్యూసెక్కులుగా నమోదైంది. స్పిల్‌వే నుంచి 10,930 క్యూసెక్కులు, ప్యాకేజీ-10 ద్వారా 3,130 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఐదు స్పిల్‌వే గేట్లను తెరిచారు. గతేడాది ఇదే రోజున నీటిమట్టం 317.89 మీటర్లుగా ఉంది.

Comments

G
Loading comments...