వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని పలు గ్రామాలలో రైతులు వరి నాట్లు పూర్తి చేశారు. మండలంలోని కొత్తపేట, బంగారు తండా, హాస్టల్ తండా, తదితర గ్రామాలలో ఇటీవల కాలంలో భారీ వర్షాలు పడ్డాయి.
దీంతో బావులలో భూగర్భ జలాలు పెరిగాయి. దాన్ని ఆధారంగా చేసుకుని కొంతమంది రైతులు వారి పొలాల్లో వరినట్లు పూర్తి చేశారు. అదే సమయంలో భారీ వర్షాలు పడడంతో చెరువులు కూడా నిండాయి. భారీ వర్షాలు వరి పంటకు మేలు చేశాయని ఆయా గ్రామాల రైతులు తెలిపారు.
Comments
Loading comments...

